FbTelugu

దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్440కే వైరస్ విజృంభణ

ఢిల్లీ: దేశంలో ఎన్440కే అనే రకం కరోనా వైరస్ ఉత్పరివర్తనం తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతోందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. ఇది కూడా దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కవగా విజృంభిస్తున్నట్లు పరిశోధనలో వెల్లడైంది.

భారత దేశంలో ఏడు వేలకు పైగా కరోనా వైరస్ ఉత్పరివర్తనాలు ఉన్నాయని ఆయన వివరిస్తూ, అందులో పలు మ్యుటేషన్లు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తాయన్నారు. ఇప్పటి వరకు ఐదు వేలకు పైగా కొత్త కరోనా రకాలపై పరిశీలన చేసి ఎలా మర్పులు చెందిందో పరిశీలించామన్నారు. అయితే కొవిడ్ 19 జన్యు సమాచారం జెనెటిక్ కోడ్ ను కనుగొనడంలో భారత్ వెనకబడి ఉందని ఉణ్నారు. దీనికి సంబంధించి పరిశోధనా పత్రాన్ని ప్రచురించామన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.