FbTelugu

ఇద్దరు ఆడ ఐఏఎస్ ల తగాదా… ఒకరి రాజీనామా!

మైసూరు: ఇద్దరు ఆడ ఐఏఎస్ అధికారుల మధ్య తగవు ఒకరి రాజీనామాకు దారితీసింది. మైసూరు లో పనిచేసే వాతావరణం లేనందున సివిల్ సర్వీసు కు రాజీనామా చేస్తున్నట్లు బాధిత ఐఏఎస్ వెల్లడించడం సంచలనంగా మారింది.
మైసూర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శిల్పా నాగ్ జిల్లా కలెక్టర్ రోహిణి సింధూరి పై పలు ఆరోపణలు చేశారు.

మీడియాతో ఆమె మాట్లాడుతూ, తనను జిల్లా కలెక్టర్ పనిచేసుకోనివ్వడం లేదని, అడుగడుగునా అడ్డు వస్తున్నదని, ఇలాంటి దురహంకారం ఎవరికీ లేదని అన్నారు. ఆమె వైఖరితో విసిగి వేసారి చివరకు రాజీనామా చేస్తున్నట్లు కమిషనర్ శిల్పా నాగ్ ప్రకటించారు. ఒక ఐఏఎస్ అధికారి, మరో ఐఏఎస్ అధికారి మధ్య ఇలాంటి తగవులు సరికాదని, తనను లక్ష్యంగా చేసుకోవడంతో మానసికంగా క్షోభ అనుభవిస్తున్నానన్నారు. శిల్సా నాగ్ 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కాగా, ఆమెను మైసూర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా 2020 ఫిబ్రవరిలో నియమితులయ్యారు. ఆడదానికి మరో ఆడది శత్రువు అంటే ఇదేనేమో మరి. రోహిణి సింధూరి ఏపి రాష్ట్రానికి చెందిన వారు కాగా కర్ణాటక క్యాడర్ లో పనిచేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.