FbTelugu

మిజోరాంలో దాక్కున్న మయన్మార్ సిఎం

గౌహతి: మిజోరాంలో సైనిక తిరుగుబాటు నేపథ్యంలో చిన్ ప్రావిన్స్ సిఎం సలాయ్ లియాన్ లువాయి మిజోరాంలో తలదాచుకున్నారు. ఆయన తన వ్యక్తిగత భద్రతా సిబ్బందితో కలిసి సోమవారం రాత్రి మిజోరం చేరుకున్నారు.
రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో ఉన్న చంపాయ్ జిల్లాలో ఆశ్రయం పొందుతున్నారని అధికారులు తెలిపారు.

సైనిక తిరుగుబాటు చేశారని, మయన్మార్ శరణార్థులను మానవతా కోణంలో చూడాలని ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఆప్ డెమెక్రసీ కేంద్ర ప్రభుత్వానికి వినతి చేసింది. భారత్-మయన్మార్ దేశాలు 1,643 కిలోమీటర్ల మేరకు సరిహద్దును పంచుకుంటున్నాయి. ఈ సరిహద్దులో మిజోరాం కు చెందిన చంపాయ్, సియాహా, లాంగ్టాయ్, సెర్చిప్, సైటువాల్ జిల్లాలు ఉన్నాయి. మయన్మార్ లోని చిన్ జాతి ప్రజలు, మిజోరాం లోని మిజో జాతి ప్రజలు జో జాతికి చెందిన పూర్వీకులే. దీంతో ఆ దేశం నుంచి ఇక్కడకు రాకపోకలు, బంధుత్వాలు ఎక్కువగా ఉంటాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.