FbTelugu

నా మాటలు వక్రీకరించారు: తలసాని

హైదరాబాద్: కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదల, లాక్ డౌన్ పై నేను చెప్పిన మాటలను వక్రీకరించారని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణలో లాక్ డౌన్ విషయంలో వదంతులు నమ్మవద్దు అని, ఈ విషయంలో నా పేరుతో వచ్చిన వార్తను ఖండిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ ఆయన ఒక టీవీ ఛానల్ తో మాట్లాడారు. హైదరాబాద్ నగరంలో కేసులు అధికంగా పెరుగుతున్నాయని, విచ్చలవిడిగా తిరుగుతున్నారని అన్నారు. ఈ పరిస్థితులను చూస్తుంటే లాక్ డౌన్ మళ్లీ అమలు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయని అన్నారు. లాక్ డౌన్ విధిస్తున్నారనే వార్త ప్రజల్లోకి వెళ్లడంతో, తన మాటలను వక్రీకరించారంటూ మంత్రి తలసాని ఖండించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.