FbTelugu

మై హోం మీడియా క్షమాపణ చెప్పాల్సిందే

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్

హైదరాబాద్: సీఎం కేసీఆర్ తో కలిసి దేశాన్ని దోచుకున్న దొంగ సొమ్ముతో కొన్న మీడియాని అడ్డుపెట్టుకొని నా మీద బురద జల్లినోళ్లకు, నిజానిజాలు తెలుసుకోకుండా దానికి వంతపాడిన కొంతమంది కాంగ్రెస్ లీడర్లకు ఇప్పటికైనా కనువిప్పు కలగాలి అని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో మైనింగ్ అక్రమాలను బయటపెట్టినందుకు, నా గురించి కావాలని తప్పుడు వివరాలు సమర్పించి, నేను చదివిన యూనివర్సిటీలో అసలు నేను చదవలేదంటూ మై హోమ్ గ్రూప్ కి చెందిన ఒక టీవీ ఛానెల్ పదే పదే రకరకాల కథనాలు ప్రసారం చేసిందని ఆయన ఆరోపించారు.

అవి నన్ను బాధించినా, నిజం నిలకడ మీద తెలుస్తదన్న నమ్మకంతో ఉన్నాను అని అన్నారు. ఈ రోజు, అదే యూనివర్సిటీలో నేను పీజీ పూర్తి చేశానని, జనార్ధన్ రాయి నగర్ రాజస్థాన్ విద్యాపీఠ్ డైరెక్టర్ అఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ స్వయంగా ఇచ్చిన లేఖను మీ ముందు పెడుతున్నాను అని ఆయన తెలిపారు.

ఇంతకాలం ఈ విషయమై ఆ మీడియా నిరవధికంగా చేసిన విచారణల్లో వాది, ప్రతి వాది, సాక్ష్యం, జడ్జి, తీర్పు, సమస్తం ఆ ఛానెల్ వారే మారారన్నారు. మైనింగ్ అక్రమాల టాపిక్ ని పక్కదోవ పట్టించడానికి తీవ్ర కృషి చేశారని మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఛానల్ వారు బేషరతుగా క్షమాపణ చెబితే ఆ యాజమాన్యానికే మంచిదని ఆర్వింద్ సూచించారు.

Janardhan Rai Nagar Rajasthan Vidyapeeth

You might also like