FbTelugu

గణేష్ ప్రతిమలను ధ్వంసం చేసిన ముస్లిం మహిళలు

మనామా: ఆ మహిళలకు పరమత సహనం పూర్తిగా లోపించింది. తన దేశంలో ఇలాంటి విగ్రహాలు పెట్టి అమ్ముతున్నారని కోపం రావడంతోనే విగ్రహాలను ధ్వంసం చేశారు. ఆపై సూపర్ మార్కెట్ సిబ్బందితో గొడవకు దిగి నానా రచ్చ చేశారు.

ఈ దారుణానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బహ్రేయిన్ రాజధాని మనామా పక్కనే ఉన్న జుఫైర్ ప్రాంతంలో ఒక సూపర్ మార్కెట్ ఉంది. వినాయక చవితి పండుగను దృష్టిలో పెట్టుకుని సూపర్ మార్కెట్ లో గణేషుడి ప్రతిమలు విక్రయం కోసం పెట్టారు. ఈ విగ్రహాలను చూసిన ఇద్దరు ముస్లిం మహిళలలో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది.

సేల్స్ బాయ్ ను పిలిచి ఇది ముస్లిం దేశం, ఇలా చేయడం సరైందేనా అంటూ భగ్గుమన్నారు. విగ్రహాలను తీసివేసి నేలకోసి కొట్టారు. ఈ విగ్రహాలను ఎవరు ఆరాధిస్తారో చూస్తానంటూ పళ్లు పటపట కొరికారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ఒక మతం ఆచారాలను అవమానించడం సరికాదని, ద్వేషపూరిత నేరంగా రాయల్ సలహాదారు ఖలీద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా ఖండించారు.

You might also like