FbTelugu

రాఘవరెడ్డికి ముస్లింల అంత్యక్రియలు

నిర్మల్: కరోనా పాజిటివ్ తో పోరాడుతూ చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ముస్లిం యువకులు ముందుకు వచ్చి మానవత్వం చాటుకున్నారు. ఈఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకున్నది.

మతం కంటే మానవత్వమే ముఖ్యమని ముస్లిం యువకులు భావించి అంత్యక్రియలు నిర్వహించారు. కడెం మండలం లక్ష్మీపూర్ గ్రామ వాసి రఘవర రెడ్డి ఇవాళ ఉదయం కరోనా పాజిటివ్ చికిత్స పొందుతూ చనిపోయాడు. దహన సంస్కారాలు చేసేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. గ్రామంలోని బంధువులు, కులస్థులు కూడా ముందుకు రాలేదు. ఈ విషయం తెలుసుకున్న ముస్లిం యువకులు దహన సంస్కారాలు చేసేందుకు సిద్ధమయ్యారు. హిందూ సాంప్రదాయం ప్రకారం స్మశాన వాటికకు మృతదేహాన్ని మోసుకుని వెళ్లారు. రెడ్డి కులం పద్దతుల ప్రకారం రాఘవరెడ్డికి అంత్యక్రియలు నిర్వహించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.