FbTelugu

హిందూ యువతులను సోదరిగా చూడాలి: ఎస్పీ ఎంపీ

లక్నో: హిందూ యువతులను, మహిళలను ఇక నుంచి సోదరీమణులుగా పరిగణించాలని సమాజ్ వాది పార్టీ ఎంపీ డాక్టర్ ఎస్.టి.హసన్ ముస్లిం యువతకు పిలుపునిచ్చారు. లవ్ జిహాద్ ఆర్డినెన్స్ వలలో ముస్లిం యువత పడవద్దని ఆయన రెండు చేతులు జోడించి కోరారు.

ఉత్తరప్రదేశ్ లవ్ జిహాదీ నిరోధించేందుకు తెచ్చిన ఆర్డినెన్స్ పై ఆయన పై విధంగా స్పందించారు. ఈ కొత్త చట్టం ఒక రాజకీయ స్టంట్ అని, మన దేశంలో యువత తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకునే హక్కు ఉందన్నారు. హిందువులు ముస్లిం అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నారు. ముస్లింలు హిందువులను వివాహముతున్నారు. మీరు ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటే ఇబ్బందులు పడతారని ముస్లిం యువకులకు సూచించారు. ఇకనుంచైనా ముస్లిం యువకులు హిందూ యువతులను సోదరిగా భావించాలని, లేదంటే ప్రభుత్వం హింసించగలదని ఎంపీ హసన్ హెచ్చరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.