FbTelugu

మ్యూజిక్ రైట్స్… మంత్రికి షాకిచ్చిన ట్విటర్

న్యూఢిల్లీ: కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ శుక్రవారం నాడు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. సుమారు గంట పాటు ఆయన అక్కౌంట్ ను ట్విటర్ నిలిపివేయడంతో కంగుతిన్నారు.
కాపీరైట్ చట్టం ఉల్లంఘించడం మూలంగా ఆయన ట్వీట్లను నిలిపివేసినట్లు తేలింది. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్.రహ్మాన్ కంపోజ్ చేసిన మా తుజే సలామ్ పాట లో ఒక క్లిప్ ను మంత్రి వినియోగించారు. తమ పాటను అక్రమంగా వాడారని సోని మ్యూజిక్ సంస్థ కాపీరైట్ వేసింది. భారత అమర సైనికుల స్మృత్యర్థం మా తుజే సలాం పాట క్లిప్ ను రవిశంకర్ ప్రసాద్ 2017 లో బ్యాక్ గ్రౌండ్ గా ఉపయోగించారు. 2017 లో చేసిన పోస్టుకు ఇప్పుడు ట్విటర్ సంస్థ మంత్రి అక్కౌంట్ ను నిలిపివేయడం ఆశ్చర్యంగా ఉంది.

ట్విటర్ భారత చట్టాలను లోబడి ఉండాలని కేంద్రం ఒత్తిడి చేస్తుండగా, ట్విటర్ ససేమిరా అంటున్న నేపథ్యంలో పరిస్థితి ఉప్పునిప్పులా ఉంది. ఒక్క ట్విటర్ మినహా మిగతా సంస్థలన్నీ భారత ప్రభుత్వానికి తలొగ్గి పనిచేస్తామని ప్రకటించాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.