FbTelugu

సంగీత దిగ్గజం పండిట్ జస్ రాజ్ కన్నుమూత

వాషింగ్టన్: సంగీత దిగ్గజం పద్మ విభూషణ్ పండిట్ జస్ రాజ్ సోమవారం నాడు అమెరికాలోని న్యూజెర్సీలో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు దుర్గా జస్ రాజ్ ప్రకటించారు.
హర్యానాలో జన్మించిన పండిట్ జస్ రాజ్ చిన్నతనంలోనే సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టారు.

తన 90 ఏళ్ల జీవితంలో 80 ఏళ్ల పాటు సంగీత ప్రపంచంలో గడిపారు. ఆయన చేసిన శాస్త్రీయ, సెమీ క్లాసికల్ కచేరీలు అల్బమ్స్ గా వచ్చాయి. ఇండియాతో పాటు కెనడా, అమెరికా, యూకే లో అనేక మందికి సంగీతంలో శిక్షణనిచ్చారు. పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషన్ వంటి పురస్కరాలు ఆయనను వరించాయి.

You might also like