FbTelugu

కుటుంబాన్నే మట్టుబెట్టిన నరహంతకుడు

భోపాల్: ప్రేమను కాదన్నందుకు కుటుంబాన్నే మట్టుబెట్టాడో వ్యక్తి. ఆ పై వారి శవాలను ఆనవాళ్లు లేకుండా వ్యవసాయ భూమిలో పూడ్చేసి ఏమి తెలియనట్లు నటించాడు. బంధువుల ఫిర్యాదుతో సామూహిక హత్యల వ్యవహారం వెలుగు చూసింది.
దివాస్ జిల్లాలోని నీమావర్ పట్టణంలో మే 13వ తేదీ నుంచి ఒక కుటుంబం జాడ లేదు. ఉన్నట్టుండి అదృశ్యం కావడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారించారు.

అయినా ఆనవాళ్లు దొరకలేదు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా, మొత్తం కథ చెప్పారు. మృతుల్లో ఒక యువతితో నిందితుడు ప్రేమలో ఉన్నట్లు చెప్పాడు. తల్లితో సహా ఇద్దరు కుమార్తెలు, మరో ఇద్దరిని తామే హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు. వ్యవసాయ భూమిలో వారి మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు తెలపడంతో పోలీసులు జెసిబిలు తెప్పించి వాటిని బయటకు తీయించారు. ఐదు ఆస్థపంజరాలను మంగళవారం నాడు వెలికి తీసి పంచనామా చేయించారు. తల్లి మమతాబాయి కాస్తే (45), ఆమె కుమార్తెలు రూపాలి (21), దివ్య (14), బంధువులు పూజా ఓస్వాల్ (15), పవన్ ఓస్వాల్ (14) గా పోలీసులు గుర్తించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.