FbTelugu

హాస్పిటల్ వార్డులోనే హత్య

కృష్ణా: కంటి ఆపరేషన్ చేయించుకుని వార్డులో రెస్టు తీసుకుంటున్న ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షల నేపథ్యంలో హత్యకు గురైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కొండపల్లికి చెందిన మొగిలి ప్రభాకర్ రావు (42) కంటికి ఆపరేషన్ చేయించుకునేండుకు సోమవారం ఉయ్యూరు రోటరీ సెంటర్ కు వచ్చాడు. మంగళవారం నాడు వైద్యులు ఆయనకు ఆపరేషన్ చేసి వార్డుకు తరలించారు.

ఈ లోగా భార్య పార్వతి, తల్లి సామ్రాజ్యం మెడిసిన్ తీసుకురావడానికి బయటకు వెళ్ళారు. ఇదే సమయంలో రమేష్ అనే వ్యక్తి వార్డులోకి వచ్చి ప్రభాకర్ రావు ను విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. ఆ తరువాత పారిపోయే ప్రయత్నం చేయగా పక్కనున్నవారు అడ్డుకుని పట్టుకున్నారు. రోటరీ సెంటర్ ఉద్యోగులు సమాచారం ఇవ్వడంతో సీఐ నాగ ప్రసాద్ వెంటనే అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
తీవ్ర గాయాల పాలైన అతన్ని అంబూలెన్స్ లో విజయవాడ జనరల్ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. రమేష్ కూడా హతుడి గ్రామానికి చెందిన వ్యక్తి అని పోలీసుల విచారణలో వెల్లడైంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.