FbTelugu

ప్రేమ జంటకు సహకరించాడంటూ హత్య

కర్నూలు: ప్రేమ వ్యవహారం ఓ యువకుని ప్రాణాలను బలితీసుకుంది. ప్రేమ జంటకు సహకరించాడని ఓ వ్యక్తిని అతిదారుణంగా హత్య చేసిన ఘటన జిల్లాలోని రుద్రవరం మండలం పేరూరులో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఓ ప్రేమ జంటకు సహకరించాడన్న కారణంతో యువతి తరపు బంధువులు దాడికి దిగారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రవీణ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like