FbTelugu

గుజరాత్ లో మొదలైన మున్సిపల్ పోలింగ్

గాంధీనగర్: గుజరాత్లో ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అహ్మదాబాద్లోని నారన్పుర వార్డులో ఓటు వేయనున్నారు. కరోనా చికిత్స తీసుకుంటున్న సీఎం విజయ్ రూపానీ కూడా రాజ్ కోట్ లో తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్కోట్, భావ్నగర్, జామ్నగర్లలో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో మున్సిపల్ ఎన్నికలు కీలకంగా మారాయి. మొత్తం 575 స్థానాలకు 2276 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఆరు కార్పొరేషన్లలో మొత్తం 1.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఫిబ్రవరి 23న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.