FbTelugu

4న మున్సిపల్ నోటిఫికేషన్?

Municipal-notification-on-4

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలకు ఈనెల 4 వ తేదీ సోమవారం నాడు నగారా మోగనున్నది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా అవసరమైన కసరత్తు ఇప్పటికే పూర్తి చేసింది. ఎన్నికల నోటిఫికేషన్, ఏర్పాట్లు, ఓటర్ల జాబితాపై జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూలు విడుదలపై సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రెండు దశల్లో మున్సిపల్ పోల్స్ జరగనున్నాయి. కోర్టు సమస్యలు లేని మున్సిపాలిటీలకు మొదటిదశలో ఎన్నికలు, కోర్టు విచారణలో ఉన్న మున్సిపాలిటీలకు రెండో దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటిదశ ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల చైర్మన్, వార్డుల రిజర్వేషన్ల కసరత్తును ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే మున్సిపల్ పరిపాలనా శాఖ వార్డుల రిజర్వేషన్ల డ్రా తీయనున్నది.

You might also like