FbTelugu

రాజకీయ పార్టీలా ఎన్నికల కమిషన్: మంత్రి బొత్స

విశాఖపట్నం: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక రాజకీయ పార్టీలా వ్యవహరిస్తోందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని కాదని ఎన్నికలు జరుపుతామనడం నేనేప్పుడు చూడలేదని విస్మయం వ్యక్తం చేశారు.

రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయాలు ఉన్నాయన్నారు. ఇవాళ బొత్స సత్యానారాయణ మీడియాతో మాట్లాడుతూ, స్ట్రెయిన్ వైరస్ విజృంభిస్తున్న సమయంలో పంచాయతీ ఎన్నికలు ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు అధికారంతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయని ఆయన గుర్తు చేశారు. ఈ నెల 16 నుంచి వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం మొదలవుతున్నదని, ఎన్నికలు నిర్వహించలేమని ప్రధాన కార్యదర్శ ఆదిత్యనాథ్ దాస్ చెప్పిన రెండు గంటల్లోనే ఎన్నికల షెడ్యూలు విడుదలైందన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.