FbTelugu

రామతీర్థంలో చంద్రబాబు హస్తం: బొత్స ధ్వజం

విజయనగరం: రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్తే లేని చంద్రబాబు నాయుడు… సీఎం జగన్ ను ఖబడ్దార్‌ అని నోటికొచ్చినట్లు మాట్లాడతారా..? అని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నిలదీశారు.
దేవుళ్ళపై దాడులు చేసే వారు అసలు మనుషులేనా.. ఈ పాడు పని చేయించినవాళ్ళు మానవ జన్మ ఎత్తేరా..? అని ఆయన ప్రశ్నించారు. సమాజం కోసం కాకుండా.. తన కమ్మ కులం కోసం ఆలోచించే వ్యక్తి నాయకుడా..? అన్నారు. చంద్రబాబుకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదు… రామతీర్థం ఘటనలో చంద్రబాబు హస్తం ఉందని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

ఇవాళ రామతీర్థం ఆలయం సందర్శించిన అనంతరం మీడియాతో మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస రావు మాట్లాడారు. సత్యనారాయణ మాట్లాడుతూ, దేవుడి విగ్రహాలు ధ్వంసం చేయడం క్షమించరాని నేరం… డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబుకు అలవాటేనన్నారు. సీఎం పర్యటనకు ముందు రోజే టీడీపీ కుట్ర చేసింది.. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పక్కదారి పట్టించాలనే కుట్ర అని ఆరోపించారు. ఇలాంటి నీచమైన ఆలోచనలు చేసే వ్యక్తి చంద్రబాబు.. చంద్రబాబు భాష చూస్తేనే అసహ్యం వేస్తుందని అన్నారు. మాన్సాస్ ట్రస్ట్‌ స్థలాలను మురళీమోహన్ లాంటి నాయకులకు కట్టబెట్టింది వాస్తవం కాదా? సత్యానారాయణ నిలదీశారు.

ఆలయాలను కూల్చిన చంద్రబాబుకు సంప్రదాయాలు గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది..? మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో ఆలయాలను కూల్చినప్పుడు దేవుడు గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. సీఎం వైఎస్.జగన్ రెడ్డి పరిపాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు.. సీఎంపై గౌరవం లేకుండా మాట్లాడతారా? అన్నారు. దేవుడు ఆస్తులను చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టారు. మతాలను రెచ్చగొట్టి రాజకీయంగా బాబు లబ్ది పొందాలని చూస్తున్నారు, దేవుడంటే బాబుకు నమ్మకం లేదని అన్నారు. రామతీర్థం ఘటనపై పోలీసుల విచారణ జరుగుతోంది… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీనివాస రావు స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.