FbTelugu

శంకరా… ఏమిటీ దుర్గతి

భోపాల్: ఆఖరి చూపులు, అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు, అయినవారు కూడా ఇష్టపడడం లేదు.

ఈ ఘటన భోపాల్ పట్టణంలో చోటు చేసుకున్నది. స్థానిక తహశీల్దార్ గులాబ్ సింగ్ భాగెల్ కథనం ప్రకారం ప్రేమ్ సింగ్ మెవడా అనే వ్యక్తి ఈ నెల 20న చికిత్ప పొందుతూ చిరాయు ఆసుపత్రిలో మృతి చెందాడు. కరోనా తో మృతి చెందడంతో ఎవరూ రాలేదు.

ప్రేమ్ సింగ్ అంత్యక్రియలు హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించాలని భార్య, కుమారుడు, తోడల్లుడు తొలుత నిర్ణయించారు. ఏమనుకున్నారో ఏమో అంత్యక్రియలు చేసేందుకు కూడా వెనకడుగు వేశారు. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్ కిట్స్ (పీపీఈ) అందచేస్తామని, ఏమి భయపడాల్సింది లేదని చెప్పినా కొడుకు ముందుకు రాలేదు. కుమారుడు నిర్ణయాన్ని తల్లి కూడా సమర్థించింది.

అంత్యక్రియల నిర్వహణ కోసం భార్య, కుమారుడి నుంచి అంగీకారం పత్రం తీసుకున్నారు. ఆ తరువాత మున్సిపల్ సిబ్బంది మృతదేహాన్ని స్మశాన వాటికకు తీసుకువెళ్లారు. ప్రేమ్ సింగ్ మృతదేహానికి తహశీల్దార్ నిప్పింటించి దహనం ప్రారంభించారు. ఆ సమయంతో భార్య, కుమారుడు, తోడల్లుడు దూరంగా నిల్చుని చూస్తుండి పోయారు. హిందూ ఆచారం ప్రకారమే అంత్యక్రియలు పూర్తి చేశారు.

ప్రజల్లో పీపీఈ కిట్లపై అవగాహన లేకపోవడంతోనే ఇంతగా భయపడుతున్నారనేది అర్థమవుతోంది. ఇప్పటికైనా వీటిపై అవగాహన కల్పించి, అంతిమ చూపు తమ సంప్రదాయం ప్రకారం పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

You might also like