FbTelugu

తెలంగాణ లో మున్సిపల్ ఎన్నికలు 30న

హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్, కార్పొరేషన్లకు ఏప్రిల్ 30 పోలింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసి) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 16వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభించి, 19న పరిశీలించి, 22న ఉపసంహరణకు అవకాశం కల్పించారు.

3వ తేదీన కౌంటింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు ప్రకటించారు. గ్రేటర్ వరంగల్ తో పాటు ఖమ్మం కార్పొరేషన్ తో పాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపల్ కు ఎన్నికలు జరగనున్నాయి. అదే విధంగా వివిధ కారణాలతో ఖాళీ అయిన డివిజన్లకు కూడా ఈ నెల 30 పోలింగ్ నిర్వహిస్తారు. వార్డు రిజర్వేషన్ల వివరాలను సంబంధిత జిల్లా కలెక్టర్లు ఇవాళ ఉదయం రాజకీయ పార్టీలకు అందచేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.