FbTelugu

షెడ్యూల్ ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు

హైదరాబాద్: తెలంగాణలో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాల్టీలకు షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారధి స్పష్టం చేశారు. కరోనా నిబంధనలకు లోబడి పోలింగ్ జరుగుతుందన్నారు.

కోర్టు కేసుల అడ్డంకులు తొలగిపోవడంతో ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందన్నారు. అధికారులతో చర్చించి ప్రక్రియ కొనసాగింపునకు నిర్ణయం తీసుకున్నామన్నారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం విధించామన్నారు. ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగుస్తుందన్నారు. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల తో పాటు జడ్చర్ల, అచ్చంపేట, కొత్తూరు, నకిరేకల్, సిద్దిపేట మున్సిపాల్టీలకు ఏప్రిల్ 30 న పోలింగ్, మే 3న ఓట్ల లెక్కింపు ఉందని పార్థసారధి తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.