FbTelugu

టీఆర్ఎస్ కు షాకిచ్చిన మున్సిపల్ ఛైర్ పర్సన్

రంగారెడ్డి: దుబ్బాక అసెంబ్లీ ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు బోల్తా పడడంతో టీఆర్ఎస్ నాయకులు పునరాలోచనలో పడ్డారు. ఒక్కొక్కరుగా వేరే పార్టీలకు జంప్ అవుతున్నారు.

ఆదిబట్ల మున్సిపల్ చైర్ పర్సన్ కొత్త ఆర్థిక టీఆర్ఎస్ పార్టీ కి గుడ్ బై చెప్పింది. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరింది. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకుడు ప్రవీణ్ గౌడ్ పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ విషయంలో సీఎం కేసీఆర్ సంక్రాంతి లోపు నిర్ణయం తీసుకోవాలని లేనట్లయితే ఆమరణ దీక్షలో కూర్చుంటానని ఎంపీ హెచ్చరించారు.
సీఎం కేసీఆర్ తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడని, జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో అరాచక పాలన నడుస్తోందన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.