FbTelugu

సుశాంత్ కేసులో పోలీసుల తీరు భేష్: హోం మంత్రి అనిల్

ముంబై: యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో ముంబై పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని, ప్రపంచంలోనే అత్యుత్తమైన పోలీసులు అని హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ వెనకేసుకు వచ్చారు.

ఈ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం పోలీసులు నడుచుకుంటారని ఆయ అన్నారు. ఆయన మరణంపై అనేక వివాదాలు తలెత్తడంతో కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండానే ఈ నిర్ణయం జరిగిపోయింది. బీహార్ ప్రభుత్వం వినతి మేరకు సిబీఐ విచారణకు ఆదేశించామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే.
అయితే సుశాంత్ మరణంపై రోజుకో కొత్త వివాదం వెలుగులోకి వస్తున్నది. కొత్త కొత్త అంశాలు వెలుగులోకి రావడంతో సంచలనంగా మారింది.

You might also like