FbTelugu

ముంబై మారణహోమం సూత్రధారి లఖ్వీ అరెస్టు

న్యూఢిల్లీ: ముంబై దాడుల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ ని పాక్ పోలీసులు అరెస్టు చేశారు. లఖ్వీని కౌంటర్ టెర్రరిజం విభాగం అరెస్టు చేసినట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది.

ఉగ్రవాద సంస్థలకు నిధులను సమకూర్చుతున్నాడనే ప్రధాన ఆరోపణతో ఆయనను అరెస్టు చేశామని పేర్కొంది. ఒక డిస్పెన్సరీ నడుపుతూ, ఉగ్రవాద చర్యలకు నిధులు సమకూర్చుతున్నారని పోలీసులు వెల్లడించారు. ఆర్థిక లావాదేవీలపై లాహోర్ నగరంలో నమోదైన కేసు ఆధారంగా స్పెషల్ ఆపరేషన్ నిర్వహించామని పోలీసులు ప్రకటించారు. 2008 ముంబై ఉగ్రదాడుల్లో 173 మంది ప్రాణాలు కోల్పోగా, 308 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో అరెస్టయిన లఖ్వీ 2015 నుంచి బెయిల్ పై ఉన్నట్లు పాక్ పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.