FbTelugu

ముఖేశ్ బెదిరింపు కేసులో మలుపు

ముంబయి: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబాని బెదిరింపు కేసులో కీలక మలుపు చోటు చేసుకున్నది. ఆయనను బెదిరించేందుకు ఉపయోగించిన స్కార్పియో వాహనం యజమాని మన్సుఖ్ హిరేన్ థానే లో అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు.

ఫిబ్రవరి 25వ తేదీన ముఖేశ్ నివాసం ఉన్న ఆంటిలియా ముందు స్కార్పియో వాహనం ఆగి ఉంది. అందులో 2.5 కేజీల జిలెటిన్ స్టిక్స్ ఉన్నాయి. దీంతో పాటు ముఖేశ్ తో పాటు ఆయన భార్య నీతా ను హెచ్చరిస్తూ జైష్ ఉల్ హింద్ పేరిట లేఖ వదిలేసిన విషయం తెలిసిందే. ఇది ట్రైలర్ మాత్రమే మున్ముందు మరింత తీవ్రంగా పరిణామాలు ఉంటాయని ఆ లేఖలో హెచ్చరించారు.

ఈ ఘటనపై ముఖశ్ కుటుంబం ఫిర్యాదు చేయడంతో పాలీసులు వచ్చి తనిఖీలు నిర్వహించి, వాహనం స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఆ వాహనం తనదేనని, ఎవరో ఎత్తుకెళ్లారని పోలీసు అధికారులకు హిరేన్ తెలిపారు. దీనిపై లోతుగా విచారణ జరుగుతున్న సమయంలో నే హిరేన్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.