FbTelugu

కోవిషీల్డ్ తోనే ఎక్కువ సురక్షితం

న్యూఢిల్లీ: దేశంలో వినియోగిస్తున్న కోవిషీల్డ్, కోవాగ్జిన్ పనితీరుపై తాజగా ఒక అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనంలో కోవీషీల్డ్తోనే ఎక్కువగా యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నట్లు వెల్లడి అయ్యింది.
ప్రీ ప్రింట్ రూపంలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ అధ్యయనాన్ని పూర్తస్థాయిలో నిపుణులు సమీక్షించాల్సి ఉంది. రెండు వ్యాక్సిన్లతో రోగ నిరోధక శక్తి పెరుగుతున్నప్పటికీ, కోవీషీల్డ్ ద్వారా యాంటీబాడీల సగటు ఉత్పత్తి స్థాయి అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. వైద్య ఆరోగ్య సిబ్బంది లో కొందరు కోవాగ్జిన్ మరికొందరు కోవిషీల్డ్ తీసుకున్నారు. ఇలా తీసుకున్న 552 మంది సిబ్బందిలో యాంటీబాడీలపై అధ్యయనం చేశారు. కోవిషీల్డ్ తీసుకున్న 425 మంది సిబ్బందిలో సెరోపాజిటివిటి రేటు 98.1 శాతం కాగా, కోవాగ్జిన్ తీసుకున్న 90 మందిలో ఈ రేటు 80శాత మాత్రమే ఉంది. యాంటీ స్పైక్ కోవిషీల్డ్ విషయంలో 127ఏయు/ఎంఎల్ కాగా కోవాగ్జిన్ విషయంలో 53 మాత్రమే నమోదు కావడం గమనార్హం.

హైదరాబాద్ కేంద్రంగా ఉత్పత్తి అవుతున్న కోవాగ్జిన్ కు ఇంత వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు రాలేదు. ఫలితంగా ఈ వ్యాక్సిన్ తీసుకున్నవారు విదేశాలకు వెళ్లే పరిస్థితి లేదు. పూణే లో ఉన్న సిరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్న కోవిషీల్డ్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి లభించడంతో పాటు 70కి పైగా దేశాలు వినియోగిస్తున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.