FbTelugu

కెసిఆర్ నిత్య మోసగాడు: మందకృష్ణ

సూర్యాపేట: సిఎం కెసిఆర్ ఉద్యమ కాలం నుంచి నేటి వరకు దళితులను మోసం చేస్తునే ఉన్నాడని ఎం.ఆర్.పి.ఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తీవ్రంగా విమర్శించారు. ఇవాళ ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు.

దళిత ఎంపవర్ మెంట్ పేరుతో మరోసారి మోసగించేందుకు సిద్ధమవుతున్నారని మందకృష్ణ ఆరోపించారు. కెసిఆర్ దళిత సాధికారికతపై మాట్లాడ్డం అంటే దెయ్యాలు వేదాలు వల్లించడమేనని అన్నారు. గత ప్రభుత్వాల కన్నా టిఆర్ఎస్ పాలనలోనే ఎక్కువ లాక్ డెత్ లు జరుగుతున్నాయన్నారు. దళితుల లాకప్ డెత్ లకు కారణమైన పోలీసులను తక్షణమే అరెస్టు చేసి శిక్షించాలన్నారు. బిజెపి నాయకుడు మోత్కుపల్లి నర్సింహులకు దళితులపై ప్రేమ తగ్గి పదవులు, కెసిఆర్ పై అమాంతం ప్రేమ పెరిగిందని ఆయన ఎద్దేవా చేశారు.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.