FbTelugu

మార్చిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు?

విజయవాడ: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూలు విడుదల చేసింది. మున్సిపల్ ఎన్నికలు పూర్తి కాగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలనే యోచనకు వచ్చింది.
ఈ ఎన్నికలను కూడా గతంలో నిలిపిన చొట నుంచి కొనసాగించాలా లేదా మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలా అనేదానిపై ఎన్నికల కమిషన్ చర్చలు జరుపుతోంది. వీటిపై గతంలో ఏకగ్రీవాలు జరగ్గా, అధికార వైసీపీ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడిందని ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి. దీనిపై ఏం చేయాలనే దాని పై న్యాయ నిపుణులతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమాలోచనలు చేస్తున్నారు.

ఇవాళ ఇదే అంశంపై రమేష్ కుమార్ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తో గంటపాటు చర్చించారు. మార్చి 10వ తేదీన మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తుండగా, 14వ తేదీన కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో మున్సిపల్ ఎన్నిక ప్రక్రియ పూర్తవుతున్నది. ఆ తరువాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించి పోలింగ్ నిర్వహించనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.