FbTelugu

ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల నోటిఫికేషన్ జారీ

విజయవాడ: ఏప్రిల్ 8 న ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించి 10వ తేదీన కౌంటింగ్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నిక సంఘం (ఎస్ఈసి) ప్రకటించింది.

నూతన కమిషనర్ గా నీలం సాహ్ని బాధ్యతలు తీసుకున్న మొదటిరోజే జెడ్పీటిసి ఎన్నికలపై కసరత్తులు పూర్తి చేసింది. న్యాయపరమైన చిక్కులు కూడా తొలగడంతో నోటిఫికేషన్ విడుదల చేసింది. హైకోర్టు ఆదేశాలు నేపధ్యంలో  ఆగిన చోట నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానున్నది. అభ్యర్ధులు మరణించిన స్ధానాలను‌ మినహాయించి‌ మిగిలిన స్ధానాలలో ఎన్నికలకి నోటిఫికేషన్ ఇచ్చారు. గత ఏడాది మార్చి 15న కరోనా కారణంగా జెడ్పి ఎన్నికలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. వాయిదా పడే సమయానికి నామినేషన్ల ఉపసంహరణ కూడా పూర్తి అయింది.

రాష్ట్ర వ్యాప్తంగా 660 జెడ్పిటిసి స్ధానాలకి నోటిఫికేషన్ ఇవ్వగా, 8 జెడ్పిటిసి స్ధానాలకి కోర్టు వివాదాలతో ఆగింది. మిగిలిన 652 జెడ్పిటిసి స్ధానాలకి 126 జెడ్పిటిసిలు వైఎస్సార్ సిపి కి ఏకగ్రీవం అయ్యాయి. వీరిలో 13 మంది జెడ్పిటిసి అభ్యర్ధులు మృతి చెందారు. మిగిలిన 513 జెడ్పటిసి స్ధానాలకి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. అనంతపురం, శ్రీకాకుళం, తూర్పుగోదావరిలో ఏకగ్రీవాలు లేవు. హైకోర్టు ఆదేశాలతో ఏకగ్రీవాలైన 126 మంది జెడ్పిటిసిలను అధికారికంగా ప్రకటించి మిగిలిన 513 జెడ్పిటిసి స్ధానాలకి ఎన్నికలు జరుపుతున్నారు.జెడ్పిటిసి ఎన్నికల బరిలో 2092 మంది అభ్యర్ధులు ఉన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎంపిటిసిల సంఖ్య 9984 కాగా కోర్టు,ఇతరత్రా కారణాలతో ఆగిన ఎంపిటిసి ఎన్నికలు 288. గత ఏడాది ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన ఎంపిటిసిల సంఖ్య 9696. ఏకగ్రీవాలైన ఎంపిటిసిలు- 2371… ఇందులో వైఎస్సార్ సిపి 2209, టిడిపి-101, జనసేన-4, ఇతరులు-67 ఉన్నారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 433,వైఎస్సార్ కడప జిల్లాలో 432, ప్రకాశంలో 348, కర్నూలులో 312 ఎంపిటిసిలు ఏకగ్రీవం అయ్యాయి. 91 చోట్ల అభ్యర్ధుల మృతితో మిగిలిన 7230 ఎంపిటిసిలకి జరగనున్న ఎన్నికలు జరగనున్నాయి. ఎంపిటిసిల బరిలో 19002 మంది అభ్యర్ధులు ఉండగా ఓటర్ల సంఖ్య 2,82,15,104, పోలింగ్ బూత్ ల సంఖ్య- 33663, అతి సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు-11251. ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన సిబ్బంధి 2,01,978.

You might also like

Leave A Reply

Your email address will not be published.