FbTelugu

వైసిపి ఎమ్మెల్యే నిర్వాకం.. ఎంపిడిఓ సస్పెన్షన్

తూ.గో.జిల్లా: వైసిపి ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు నిర్వాకం మూలంగా ఎంపిడిఓ వేంకటేశ్వర రావు బలయ్యాడు. నిబంధనల ప్రకారం రాష్ట్రంలో రెండో డోసు మాత్రం వేస్తుండగా, బలవంతం చేయించి ఫస్ట్ డోసు వేయించాడు.

పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు గతవారం తన కుటుంబ సభ్యులందరికీ కోవాగ్జిన్ వ్యాక్సిన్ వేయించాడు. రెండవ డోస్ మాత్రమే వేయాల్సి ఉండగా 11 మందికి ఫస్ట్ డోసు వేయించాడు. ఎంపిడిఓ వేంకటేశ్వర రావు పై ఒత్తిడి తెచ్చి భార్య, కుమారుడు సహా 11 మంది బంధువులకు మొదటి డోస్ వేయించినట్లు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు లు వెళ్లాయి. ఈ వ్యవహారంపై అమలాపురం సబ్ కలెక్టర్ విచారణ జరిపి, జిల్లా కలెక్టర్ కు నివేదిక పంపించాడు. నివేదిక పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎంపిడిఓ వేంకటేశ్వర రావు ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.