FbTelugu

విశాఖ ఉక్కును వదులుకోం: ఎంపీ వీవీఎస్ రెడ్డి

విశాఖపట్నం: ఎటువంటి పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడం మా పార్టీ ఆమోదించదని వైసీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. గతంలో కూడా చెప్పాం, పార్లమెంట్ లోపల… బయట కూడా ఉద్యమాన్ని పోరాటాన్ని కొనగిస్తామని ఆయన అన్నారు
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వైసీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి పాదయాత్ర చేపట్టారు. అంతకు ముందు జీవీఎంసీ వద్ద గాంధీ విగ్రహానికి నివాళులర్పించి, పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రలో విశాఖ నగర వాసులు, స్టీల్ ప్లాంట్ కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఐదు నియోజకవర్గాల మీదుగా దాదాపు 25 కిమీ మేర పాదయాత్ర కొనసాగి కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ గేట్ ఎదుట సాయంత్రం బహిరంగ సభ నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట యాత్రకు ఈరోజు నాంది పలకడం జరిగిందన్నారు. విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కొంతమంది రాజకీయ విమర్శలు చేస్తున్నారు… మీ పోరాటం ఇక్కడ చేస్తే ఏముంటుంది? అని అంటున్నారు. ఢిల్లీలో చేయండని పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. వారికి నేను చెప్పే జవాబు ఒక్కటే చెప్తున్నా…

గతంలో కూడా విశాఖ ఉక్కుని సాధించినప్పుడు అప్పట్లో (1978లో) పోరాటం ఇక్కడే కొనసాగించారని విజయసాయి రెడ్డి తెలిపారు. ఢిల్లీలో కూడా కొనసాగించారన్నారు.
ఏదైనా కూడా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ విశాఖలోనూ, అక్కడ ఢిల్లీలోనూ పోరాటం సాగించినట్లైతే మనం అనుకున్నది సాధిస్తామన్నారు. కాబట్టి మిగతా రాజకీయ పార్టీలు ఏ రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారో వాళ్ళందరిని కూడా కలిసి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను… ఇది వాళ్ల విజ్ఞత కే వదిలేస్తున్నాను అని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.