FbTelugu

చట్టం ఎవరినీ వదిలి పెట్టదు: విజయసాయిరెడ్డి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో విగ్రహాల ధ్వంసానికి పాల్పడిన వారెవరూ తప్పించుకోలేరని, చట్టం ఎవరినీ వదిలిపెట్టదని వైసీపీ ఎంపీ (రాజ్యసభ సభ్యుడు) విజయసాయిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా.. బీజేపీ, టీడీపీలపై విమర్శలు కురిపించారు. ప్రభుత్వ పథకాల్లో ఏవైనా తప్పిదాలు దొర్లితే ప్రతిపక్షాలు ఎత్తి చూపకుండా.. గుళ్లు, విగ్రహాల ధ్వంసాలకు పాల్పడుతోందన్నారు.

రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే సీఐడీ విచారణకు ఆదేశించారన్నారు. ఇదే సమయంలో కొత్త రథాన్ని ప్రభుత్వం తయారు చేయించిందని గుర్తు చేశారు. కొట్లాటలు పెట్టడం మాని, మంచి పనుల కోసం సూచనలు ఇస్తే సీఎం స్వీకరిస్తారని హితవుపలికారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.