FbTelugu

కేసిఆర్ దళిత ద్రోహి: విహెచ్

హైదరాబాద్: పేద వారికి భూములు ఇచ్చినప్పుడే పివి కి నిజమైన నివాళి అని మాజీ ఎంపీ వీ. హనుమంత రావు అన్నారు.

పివి శత జయంతి ఉత్సవాలు అంటూ పేదల భూములు గుంజుకుంటున్నారని ఆయన విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం,  ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకవైపు పివి నర్సింహారావు శత జయంతి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా చేస్తామని గొప్పలు చెప్పుకుంటూ మరో వైపు పేద దళితుల భూములు గుంజుకొని వారిని చంపేస్తున్నారని  విమర్శించారు. సోమవారం నాడు ఆయన తన నివాసంలో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ పివి  ముఖ్యమంత్రి గా,  ఇందిరాగాంధీ ప్రధానమంత్రి గా దేశంలో పేదలకు భూ సంస్కరణలు అమలు చేసి భూములు ఇచ్చారని అన్నారు. పివి కి శత జయంతి ఉత్సవాలు అని ప్రపంచంలో అందరిని పిలుస్తున్న కేసీఆర్ తన నియోజకవర్గంలో వెలురులో బ్యాగరు నర్సింలు 13 గుంటల భూమి గుంజుకున్నారని విమర్శించారు.

తను ఆ గ్రామానికి వెళ్లి నర్సింలు కుటుంబాన్ని పరామర్శించి రూ.10 వేలు ఆర్థిక సహాయం చేశామని, వారి వద్ద ఆ భూమి తాలూకు పట్టా కూడా ఉందని ఆయన  వివరించారు. పేదలకు న్యాయం చేసినపుడు పివికి అసలైన నివాళి అని హనుమంతావు అన్నారు.

You might also like