FbTelugu

ట్రాఫిక్ పోలీసులపై ఎంపీ కొడుకు వీరంగం

 ఉడిపి:మద్యం తాగి కారు నడుపుతూ పట్టుబడిన ఎంబీబీఎస్ విద్యార్థి… నేను ఎవరో తెలుసా, మా నాన్న ఎంపీ, మాజీ సీఎం సిద్ధరామయ్య నాకు తెలుసు అంటూ హుంకరించాడు.
సిద్ధరామయ్యను పిలిపించమంటారా? నేను జరిమానా ఎందుకు చెల్లించాలి? అని అడగడంతో చిర్రెత్తుకొచ్చిన పోలీసులు అతనికి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించారు. మోతాదుకు మించి తాగడంతో రూ.3వేల ఫెనాల్టీ వేయగా, రూ.300 మాత్రమే కడతానన్నాడు. పోలీసులు చేసేది లేక వాహనం సీజ్ చేశారు.
‘రూ.3000 ఫైన్.. ఎవరిని అడుగుతున్నారు? ఇంతకీ నేనెవరో తెలుసా? మా నాన్న ఆంధ్రాలో ఎంపీ. కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య నాకు తెలుసు. పిలిపించమంటారా? ఇక్కడికి’.. ఇవన్నీ డ్రంక్ డ్రైవ్లో దొరికిన ఓ యువకుడు పోలీసులతో చెప్పిన మాటలు.

శనివారం రాత్రి ఉడిపిలోని కల్సంకా జంక్షన్ వద్ద పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగి వాహనం నడుపుతున్న మణిపాల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థి అనురాగ్ రెడ్డిని ఆపారు. అతనికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా 193 యూనిట్లు చూపించింది. పోలీసులు అతడికి రూ.3000 జరిమానా విధించారు. రూ.300 కంటే ఒక్క రూపాయి ఎక్కువ చెల్లించనని యువకుడు స్పష్టం చేశాడు.
మా డాడీ ఆంధ్రప్రదేశ్ ఎంపీ, ప్రభుత్వ హోంశాఖ కార్యదర్శి నా తండ్రి స్నేహితుడు, సిద్ధరామయ్య మా డాడీకి ఫ్రెండ్, నేను వారిని పిలుస్తాను అంటూ అల్లరి చేశాడు. ఎంతగా పోలీసులు చెప్పినా వినిపించుకోకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు అనురాగ్ రెడ్డి కారును స్వాధీనం చేసుకున్నారు. బెదిరింపులకు దిగడంతో ఉడిపి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.