FbTelugu

ఎంపి సంతోష్ దిష్టి బొమ్మల దగ్ధం

వరంగల్ అర్బన్: వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అనుచరులు, అభిమానులు టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ పై భగ్గుమంటున్నారు. సంతోష్ కుమార్ సిఎం కెసిఆర్ తోడల్లుడి కుమారుడు.

మంత్రి ఈటలను కేబినెట్ నుంచి సాగనంపే కుట్రలో సంతోష్ కుమార్ కు ప్రధాన భాగస్వామ్యం ఉందని ఆయన అభిమానులు మండిపడుతున్నారు. శుక్రవారం రాత్రి హుజూరాబాద్ నియోజకవర్గంలో పలు చోట్ల సంతోష్ కుమార్ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. ఏడాది కాలంగా ఈటల ను సాగనంపేందుకు సంతోష్ కుట్రలు పన్నుతున్నారని అభిమానులు ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో స్కూటర్ పై వచ్చే కొందరు నాయకులు ఇవాళ వందల కోట్ల రూపాయలు సంపాదించారని ఈటల ఆరోపించిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.