FbTelugu

బీజేపీవి అనవసర విమర్శలు: ఎంపీ రంజిత్

హైదరాబాద్: తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వంపై కరోనా విషయంలో బీజేపీవి అనవసర విమర్శలని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

కరోనా కట్టడిలో తెలంగాణ దేశానికే ఆదర్శమన్నారు. కరోనా సమయంలో రాజకీయాలొద్దని అన్నారు. జాతీయ భద్రతపై, కరోనాపై టీఆర్ఎస్ ప్రభుత్వమెన్నడూ రాజకీయాలు చేయలేదని అన్నారు. కరోనా భారత్ లోకి సంక్రమిస్తున్న తొలినాళ్లలోనే లక్షమందితో నమస్తే ట్రంప్ ప్రోగ్రాం చేసింది బీజేపీ సర్కారేనని ఎద్దేవా చేశారు.

You might also like