FbTelugu

అచ్చన్నను కలవనివ్వడం లేదు: ఎంపీ రామ్మోహన్

గుంటూరు: మాజీ మంత్రి కె.అచ్చెన్నాయుడును ఇవాళ కూడా కలిసేందుకు అధికారులు అంగీకరించలేదని ఎంపీ కె.రామ్మోహన్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అధికారులతో మాట్లాడి అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నామన్నారు. శస్త్ర చికిత్స చేయించుకున్న వ్యక్తిని వందల కిలోమీటర్లు తీసుకు వచ్చారన్నారు. ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి చెబితే గాని ఆసుపత్రికి తీసుకు రాలేదన్నారు.
అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. కానీ ఆసుపత్రి సూపరింటెండెంట్ సంతకం లేకుండానే నివేదిక ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. కింది స్థాయి అధికారుల పేరిట నివేదిక పంపిస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా ఆసుపత్రి అధికారులు వ్యవహరిస్తున్నారని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు.

ఆయనను ఎలాగైనా జైలులో పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇందు కోసం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏసీబీ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. విచారణ పేరుతో అర్థరాత్రి సమయంలో డిశ్చార్జి చేసేందుకు యత్నించారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రామ్మోహన్ నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.