FbTelugu

ఉచిత పథకాలపై మోదీకి ఎంపీ రాజు లేఖ

న్యూఢిల్లీ: రాష్ట్రాల్లో ఉచిత పథకాల ద్వారా రాష్ట్ర ఖజానాలు ఖాళీ అవుతున్నాయనీ, కోలుకోలేని అప్పుల్లో రాష్ట్రాలు కూరుకుపోతున్నాయని ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
ఉచిత బహుమానాలు ప్రకటించి ప్రభుత్వాలు లబ్ధిదారులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయని ఆయన ఆరోపించారు. తమ పదవీ కాలంలో వచ్చే ప్రతి ఎన్నిక సందర్భంలోనూ ప్రజలకు కానుకలిచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయన్నారు. అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన వంటి కీలక అంశాలు విస్మరించి వాటి నిధులను కూడా ఓట్ల కోసం ఉచితాలకు తరలిస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రాలు ప్రకటిస్తున్న ఉచితాలను నియంత్రించాల్సిన కీలక సమయం ఆసన్నమైందని ప్రధానిని కోరారు. ఉచిత పథకాల పరంపరకు చట్టం ద్వారా నియంత్రణ తీసుకురావాలని రఘురామకృష్ణంరాజు కోరారు.
రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న ఉచిత పథకాలు ప్రజలను నిరంతర యాచకులు గా మారుస్తోందని … తద్వారా బలహీన వర్గాల అభ్యున్నతి సాధ్యపడదని స్పష్టం చేశారు. రాష్ట్ర ఖజానాలు ఉచితాలకు పంచి పెట్టి మరిన్ని నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారన్న మండిపడ్డారు. రాష్ట్ర బడ్జెట్లో ఉచితాలకు కేటాయింపులపై పరిమితి విధించడం, ఈ కానుకల అందించే సమయం పై నియంత్రణ తీసుకురావడం ద్వారా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టవచ్చని రఘురామకృష్ణంరాజు తన లేఖలో తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.