FbTelugu

సీఎం జగన్‌కు ఎంపీ రాజు లేఖ

ఏలూరు: భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డికి వైసీపీ ఎంపీ కె.రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు.
రాష్ట్రంలో 20లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు కార్మిక శాఖ కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేయించుకున్నారని తెలిపారు. అయితే వీరిలో 10లక్షల 66 వేల మంది కార్మికుల పేర్లను మాత్రమే ఆధార్‌ నెంబర్ తో లింక్ చేశారన్నారు. మిగిలిన వారి పేర్లు ఆధార్ తో వెంటనే లింక్ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

బిల్డర్స్ నుంచి సంక్షేమ నిధి రూపేణా రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2019 మధ్య కాలంలో రూ.1,364 కోట్లు వసూలు చేసిందన్నారు. ఇప్పటి వరకు రూ.330 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. మిగతా రూ.1 వెయ్యి కోట్ల నిధుల నుంచి ఒక్కో భవన నిర్మాణ కార్మికుడికి రూ.5 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందించాలని రఘురామ కృష్ణరాజు సీఎం జగన్ ను కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.