FbTelugu

ప్రాణహాని ఉంది… రక్షణ కల్పించాలి: ఎంపీ రాజు

ఢిల్లీ: ప్రాణహాని ఉంది రక్షణ కల్పించమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డిని కోరినట్లు నరసాపురం ఎంపీ కె.రఘురామ కృష్ణరాజు తెలిపారు.

రక్షణ కల్పించిన తరువాతే తన నియోజకవర్గానికి వెళ్తానని, తనకు కేంద్రం రక్షణ ఇస్తుందనే ఆశభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. తనకు నిత్యం రాయలసీమ వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి కాబట్టే రక్షణ కల్పించాలని కోరానన్నారు. ఇవాళ కేంద్ర మంత్రులతో భేటీ అయిన తరువాత కె.రఘురామ కృష్ణరాజు మీడియాతో మాట్లాడారు.
నేను వైసీపీ లో క్రమశిక్షణ కలిగిన నాయకుడిని, పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి పై నోరు పారేసుకోలేదని, పార్టీ నిబంధనల ప్రకారమే నడచుకుంటున్నాను అని ఆయన చెప్పారు. వాళ్లే తనపై వార్తలు రాయించి, ఆపై షోకాజు నోటీసులు ఇప్పించారన్నారు. పార్టీ నిర్ణయాలను తను విభేధించినట్లు సీఎం జగన్ రెడ్డి కుల సోషల్ మీడియాలో లేనిపోని దుష్ర్పచారాలు చేస్తున్నారని ఎంపీ రాజు ఆరోపించారు.

ఎంపీ వి.విజయసాయి రెడ్డి ఎన్ని దొంగ రాతలు రాయించినా, పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకుడినే అపి ఆయన స్పష్టం చేశారు. విజయసాయి చర్యలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. టీటీడీ బోర్డు నిర్ణయాలను ఒక భక్తుడిగా విభేధించా, అందువల్లే నాకు షోకాజు నోటీసు ఇచ్చారని రఘురామ రాజు ఆరోపించారు.

వీలైతే షోకాజు నోటీసు ఉపసంహరించుకోవాలి, జగన్ బిజీగా ఉన్నారని చెబుతున్నారు. సమయం ఇస్తే వెళ్లి కలుస్తా లేదంటే మెయిల్ లో సమాధానం పంపిస్తానన్నారు. కరోనా టైమ్ లో అనుమతి లేకుండా వెళ్తే అరెస్టు చేసే ప్రమాదముందని రఘురామ రాజు అనుమానం వ్యక్తం చేశారు. నా షోకాజ్ నోటీసులపై ఎలా ముందుకు వెళ్లాలా అనే దానిపై తీవ్రంగా ఆలోచిస్తున్నానని ఆయన చెప్పారు. రాజకీయ పార్టీ విధి విధానాలను తెలుసుకోవడానికే కేంద్ర ఎన్నికల కమిషన్ లో అధికారులను కలిశానని ఎంపీ రఘరామ రాజు అన్నారు.

You might also like