FbTelugu

వైసీపీ అధినేతకు షాకిచ్చిన ఎంపీ రాజు

తాడేపల్లి: నరసాపురం ఎంపీ కే.రఘురామ కృష్ణరాజు వైసీపీ అధినాయకత్వానికి గట్టి షాకిచ్చారు.

తనకు పార్టీ నాయకత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసుపై ఘాటుగా ప్రతిస్పందించారు. తనకు పంపించిన పార్టీ లెటర్ హెడ్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో షోకాజ్ నోటీసు ఏ ప్రాతిపదికన ఇచ్చారని ప్రశ్నించారు.

కేంద్ర ఎన్నికల కమిషన్ లో రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారని అనుమానాన్ని లేవనెత్తారు. అసలు పార్టీలో క్రమశిక్షణ సంఘం ఉందా? ఉన్నట్లయితే ఎన్నికల కమిషన్ గుర్తింపు ఉందా అని నిలదీశారు. రఘురామ కృష్ణరాజు చెప్పిన విధంగానే 24 గంటల వ్యవధిలో పార్టీ షోకాజ్ నోటీసుకు సమాధానం పంపించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.