FbTelugu

జస్టిస్ రమణపై జగన్ అసత్య ఆరోపణలు: ఎంపి రాజు

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పదోన్నతి అడ్డుకునేందుకు ఆంధ్రా సీఎం వైఎస్.జగన్ ఎన్నో కుట్రలు, పన్నాగాలు పన్నినా ఫలించలేదని వైసిపి ఎంపి కె.రఘురామకృష్ణం రాజు ఆరోపించారు.
జస్టిస్ రమణను ప్రధాన న్యాయమూర్తిగా కాకుండా అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డేకు లేఖ రాసి, మీడియాకు రిలీజు చేశారన్నారు.

రాజు మీడియాతో మాట్లాడుతూ, పలువురు ఎంపీలు సిఎం జగన్ తీరును అభిశంసించారన్నారు. అమరాతి ఇన్ సైడర్ ట్రేడింగ్ పై హైకోర్టు కేసును కొట్టివేసినా జగన్ కు బుద్దిరాలేదన్నారు. అదే అంశంపై రమణ పై ఫిర్యాదు చేయడం జగన్ కు ఏమాత్రం సిగ్గులేదనడానికి నిదర్శనమన్నారు. సిఎం జగన్ లేఖలో పేర్కొన్న ఆరోపణలన్నీ ఆధారరహితంగా, చిల్లరగా, అసత్యాలు, దురద్దేశాలతో కూడుకుని ఉన్నాయని ప్రధాన న్యాయమూర్తి బోబ్డే ఒక ఇంగ్లీషు పత్రికలో వ్యాఖ్యానించారని ఆయన అన్నారు. బోబ్డే రమణపై ఆరోపణలు తిరస్కరించినందున జగన్ తన పదవికి రాజీనామా చేయాలని ఎంపి రాజు డిమాండ్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.