FbTelugu

ఎం.పీ రాజు నీచంగా వ్యవహరిస్తున్నారు: మంత్రి శ్రీనివాస్

తిరుమల: ఎం.పీ కె. రఘురామ కృష్ణం రాజు నీచంగా వ్యవహరిస్తున్నారు, ప్రజల ప్రాణం, ప్రజల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు అన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న తరువాత మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్ మోహన్ రెడ్డిని, ఈ ప్రభుత్వాన్ని ఒక మతానికి అంటకట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. హైదబాద్ లో చంద్రబాబు, ఢిల్లీలో కూర్చొని రఘురామ కృష్ణంరాజు హిందూ మతం పై సవతి ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. గణేష్ ఉత్సవాలపై నిర్ణయం తీసుకునే ముందు, ఇతర రాజకీయ పక్షాలతోను, స్వామిజీలతోను మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఇళ్లకే పరిమితం అయి చేసే విధంగా నిర్ణయం తీసుకున్నామని, ఇలాంటి అంశంపై రఘురామ కృష్ణం రాజు మాట్లాడటం మంచి పద్ధతి కాదన్నారు. ఢిల్లీ నుంచి నియోజకవర్గానికి రాకుండా విమర్శలు చేయడం తగదన్నారు. హిందూ మతం పై నమ్మకం ఉంటే నీ నియొకవర్గానికి వచ్చి వినాయక చవితి పూజలు నిర్వహించాలని మంత్రి శ్రీనివాస రావు సవాల్ చేశారు. చంద్రబాబు మార్గదర్శకల్లో పనిచేస్తున్నావ్, నువ్వు పనిక మాలిన రాజకీయ నాయకుడవు అని మంత్రి ధ్వజమెత్తారు.

tirumala darshan

You might also like