FbTelugu

రమేష్ హాస్పిటల్ కు ఎంపి రఘురామ

గుంటూరు: అరెస్టు అయిన ఎంపి కె.రఘు రామకృష్ణ రాజు రిమాండ్‌ రిపోర్టును సిఐడి కోర్టు పెండింగ్‌లో పెట్టింది. వెంటనే ఆయనకు చికిత్స అందించాలని ఆదేశించింది.
ఎంపి కాళ్లకు తగిలిన గాయాల ఆధారాలను రఘురామ తరఫు న్యాయవాదులు కోర్టు ముందుంచారు. అరికాళ్లపై గాయాలు, వివరాలను న్యాయస్థానం నమోదు చేసుకుంది.

ఆరోగ్య పరిస్థితుల రీత్యా చికిత్స కోసం ఎంపి ని ఆసుపత్రికి తరలించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సకు రఘురామ నిరాకరించారు. దీంతో ఆయనకు గుంటూరు రమేశ్‌ ఆసుపత్రిలో చికిత్స చేయించాల్సిందిగా కోర్టు సిఐడి అధికారులను ఆదేశించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.