FbTelugu

ఎంపి రఘురామకు బెయిల్ మంజూరు

న్యూఢిల్లీ: వైసిపి ఎంపి కె.రఘురామ కృష్ణమరాజుకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. సుప్రీంకోర్టులో ఇవాళ బెయిల్ పిటీషన్ పై వాదోపవాదాలు జరిగిన తరువాత బెయిల్ ఇస్తున్నట్లు ప్రకటించింది.

ఎంపి రాజు తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సుధీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్‌ను మంజూరు చేసింది. సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ లో ముగ్గురు వైద్యుల బృందం పరీక్షించి ఎక్స్‌ రే, వీడియో కూడా పంపారని ధర్మాసనం తెలిపింది. ఎంపి కి జనరల్‌ ఎడిమా ఉందని, ఫ్రాక్చర్ కూడా అయినట్లు నివేదికలో ఉందన్నారు. మిలిటరీ హాస్పిటల్ వైద్యుల బృందం సమర్పించిన నివేదికను సుప్రీం పరిశీలించింది.

అయితే ఎంపి రాజు ఎలాంటి ఇంటర్వ్యూలు మీడియాకు ఇవ్వకూడదని, ఏపి సిఐడి విచారణకు సహకరించాలని తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు న్యాయవాది సమక్షంలో సిఐడి  విచారణ జరగాలని స్పష్టం చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.