FbTelugu

ఎన్‌హెచ్‌ఆర్‌సి ఛైర్మన్‌ ను కలిసిన ఎంపి రఘురామ

న్యూఢిల్లీ: వైసిపి ఎంపి కె.రఘురామ కృష్ణమరాజు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) ఛైర్మన్‌ పి.సి.పంత్‌ను కలిశారు. ఏపి సిఐడీ పోలీసులు విచారణలో థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని రఘురామ కోరారు.

సిఐడీ పోలీసులు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని చెప్పారు. ఈ అంశంపై ఇప్పటికే ఎన్‌హెచ్‌ఆర్‌సికి ఎంపి కుమారుడు భరత్ ఫిర్యాదు చేశారు. భరత్ ఫిర్యాదుపై ఇప్పటికే అంతర్గత విచారణకు ఆదేశించింది. భరత్ ఫిర్యాదుపై ఏపి ప్రభుత్వం, డిజిపి, సిఐడీకి ఎన్‌హెచ్‌ఆర్‌సి నోటీసులు పంపించింది. సిఐడీ అధికారుల తీరును రఘురామ స్వయంగా కలిసి వివరించగా, మొత్తం వ్యవహారంపై విచారణ చేస్తామని ఛైర్మన్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.