FbTelugu

వైసీపీ పాలనలోనే దాడులు: రఘురామకృష్ణరాజు

* రామతీర్థం ఘటనపై మోదీకి లేఖ
* సమగ్ర విచారణ జరపాలంటూ విన్నపం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే హిందూ దేవాలయాలపై దాడులు తీవ్రంగా పెరిగిపోయాయని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. తాజాగా విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల మండలంలో కొందరు దుండగులు శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు.

ఆ లేఖలో పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వందకు పైగా హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. ఇటీవలే మూడు ఆలయాల్లో రథాలను తగులబెట్టారని గుర్తుచేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.