FbTelugu

ఎంపి రాజు బెయిల్ పై బయటకు

హైదరాబాద్: వైసిపి ఎంపి కె.రఘురామ కృష్ణమ రాజుకు ఇవాళ సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జీ అయ్యారు. నాలుగు రోజుల క్రితమే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరుచేసినప్పటికీ, ఇవాళ బయటకు వచ్చారు.

జగన్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారనే ఆరోపణలపై ఏపి సిఐడి అదుపులోకి తీసుకుని గుంటూరు తరలించింది. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. తనను కొట్టారంటూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో, ఏపిలో కాకుండా తెలంగాణలోని మిలిటరీ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించడం, ఆ తరువాత బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. గాయాలు తగ్గకపోవడంతో ఆయన ఇవాళ్టి వరకు హాస్పిటల్ లోనే ఉండిపోయారు. డిశ్చార్జీ తరువాత ఆయన నేరుగా విమానంలో ఢిల్లీ వెళ్లిపోయారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.