FbTelugu

కొత్త జిల్లాకు అల్లూరి పేరు పెట్టాలి: ఎంపీ రాజు డిమాండ్

తూ.గో.జిల్లా: రాష్ట్రంలో కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేస్తే స్వాతంత్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని నరసాపురం ఎంపీ కె.రఘురామ కృష్ణరాజు సీఎం వైఎస్.జగన్ కు లేఖ రాశారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేసిన పాదయాత్రలో మీరు ప్రజకు హామీ ఇచ్చారని రాజు సీఎం జగన్ కు గుర్తు చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం అమలు చేసేందుకు అధికారికంగా ప్రకటన చేయాలని ఆయన కోరారు. కొత్త జిల్లాకు ఆయన పేరు పెడితే ప్రజలు సంతోషపడతారని, సమరయోధుడికి ఘనమైన నివాళి అర్పించినట్లు అవుతుందని ఎంపీ రాజు ఆ లేఖలో తెలిపారు.

You might also like