FbTelugu

రాజధానిపై జగన్ గతంలో ఏం చెప్పలేదు: ఎంపీ రఘురామ

అమరావతి: మరో మారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సీఎం జగన్ పై వ్యంగాస్త్రాలు విసిరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఏపీ రాజధానిగా అమరావతికి వ్యతిరేకమని జగన్‌ చెప్పలేదని.. ఇప్పుడెందుకు నిర్ణయం మార్చుకున్నారో అర్థం కావట్లేదన్నారు. జగన్ కలలో ఎవరు కనపడి రాజధాని మార్చమన్నారో తెలియదంటూ.. వ్యంగ్యాస్త్రాలు సందించారు.

ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత అభిప్రాయాలకు చోటు లేదని, రహస్యంగా రెఫరెండం పెట్టినా సరిపోతుందన్నారు. 3 రాజధానులు కావాలా, వద్దా అనే అంశంపై రెఫరెండం తీసుకోవాలంటూ కోరారు. రాజధాని అంశంపై రెఫరెండెం నిర్వహించే వరకు నెలపాటు వాయిదా వేయాలని కోరుతున్నామన్నారు. సెక్షన్‌ 6 చదివితే అన్ని విషయాలు అర్ధమవుతాయని హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయంతోనే ముందుకెళ్లాలన్నారు.

You might also like