FbTelugu

ఎంపి నవనీత్ కౌర్ కులం సర్టిఫికెట్ రద్దు

ముంబయి: అమరావతి నుంచి స్వతంత్ర ఎంపిగా గెలుపొందిన సినీనటి నవనీత్ కౌర్ కులం సర్టిఫికెట్ ను ముంబయి హైకోర్టు రద్దు చేసింది. ఇదే కాకుండా రూ.2 లక్షల జరిమానా విధించింది.

ఈ తీర్పు తో ఆమె లోకసభ సభ్యత్వం ప్రమాదంలో పడనున్నది. నవనీత్ కౌర్ ఎస్సి కులం కాదని, తప్పుడు పత్రం సమర్పించి ఆమె ఎన్నికల్లో పోటీ చేశారని మాజీ ఎంపి, ప్రత్యర్థి ఆనందరావు అదసూల్ ముంబయి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై విచారించిన హైకోర్టు ఎస్సి కులం సర్టిఫికెట్ రద్దు చేయండమే కాకుండా రూ.2 లక్షలు జరిమానా విదించడం మహారాష్ట్రలో సంచలనంగా మారింది. 2019 లో జరిగిన అమరావతి రిజర్వ్ నియోజకవర్గం నుంచి నవనీత్ కౌర్ విజయం సాధించింది. అంతకు ముందు ఎన్.సి.పి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నవనీత్ తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, పంజాబీ చిత్రాలలో నటించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.